Skip to main content

Posts

Showing posts from May, 2021

క్షణికావేశ నిర్ణయం

ముంబాయ్ లోని ఒక చిన్న పారిశ్రామిక వేత్త వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి..  తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చనిపోవాలని నిర్ణయించుకుని... చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు.. ఇంతలో అతని వద్దకు ఒక వృద్ధుడు వచ్చి కూర్చుని ఏమినాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావని అడిగాడు. వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు. ఆ వృద్ధుడు వెంటనే చెక్ రాసి ఇచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు.  వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు... దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతఙ్ఞతలు చెప్పుకుని తిరిగి ఇంటికి వచ్చాక.. ఆ చెక్ వాడకుండానే పని పూర్తయ్యేలా ప్లాన్ చేద్దామనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. అవి అన్నీ సంతృప్తిగా అనిపించి తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు. అదేంటో గాని చెక్ తనవద్ద ఉందన్న #ఆత్మవిశ్వాసంలో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతం అవుతూ వచ్చింది. ధైర్యంగా తను వేసిన ముందడుగు వలన వెనుతిరిగి చూసుకునే అవకాశమే లేకుండా అన్ని కలిసొచ్చాయి. సంవత్సరం తిరిగే సరికి తన అప్పులన్ని పో...

సార్థకత

ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది.  మర్రిపండుని  నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారి పడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం  ప్రక్కన  ఉన్న మైదానం.  మర్రిపండు మైదానంలో పడిన రోజునే  బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది.  రెండు రోజుల తరువాత  మర్రి పండు విచ్చుకుని అందులో ఉన్న గింజలు బయట పడ్డాయి.  మర్రి గింజలు వాటిలో  అవి మాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా  “మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనమింకా బ్రతికి ఉన్నాము. లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము” అంది.    మరో గింజ “నిజమే.  పక్షి కడుపులోకి వెళ్ళి ఉంటే  చచ్చేవాళ్ళం. ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు” అని చెప్పింది.  మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి.   మరో రెండు రోజులు గడిచేసరికి  ఒక గింజ నుండి మొలక  వచ్చింది.   ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి “మీరంతా చూడండి. నాకు మొలక  వచ్చింది” అని చూపించింది.   మొలకను చూ...