ఊర్లలో, కొత్తగా ఇంటికి తెచ్చిన కోడిని ఇంటి ఆవరణకు అలవాటు చేయడానికి, ఒక వారం రోజుల పాటు, ఒక గుంజెకు తాడుతో కట్టేస్తారు, తర్వాత దాన్ని విడిచిపెట్టినా ఊరు మొత్తం తిరిగి తిరిగి చీకటి పడే ముందు అదే ఇంటికి వచ్చి గంప చుట్టూ తిరుగుతది కానీ పారిపోదు ఎందుకంటే దాన్ని అలా conditioning చేశారు. ఎంత అంటే పంజరంలో ఉన్న చిలుక ఎగురుతున్న పక్షుల్ని చూసి వాటికి ఏదో రోగం వచ్చింది కావొచ్చు అనుకునే అంత conditioning చేస్తారు. Ex:- సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు బాగా ఫాలో అయ్యే ఒక మహిళ, ఎవరైనా న్యూ జనరేషన్ అమ్మాయి ఇలాంటివి ఫాలో అవ్వకుండా తనకు నచ్చినట్టు తాను బ్రతికితే బరితెగించి బ్రతుకుతుంది అంటారు, కానీ వారు మాత్రం అందమైన పంజరంలో జీవిత ఖైదు అయ్యాము అని మాత్రం ఒప్పుకోరు.. అదే విధంగా Western countries లో, కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్కను కొన్ని రోజుల పాటు ఇంటి ఆవరణలో ఒక fence వేసి పెడతారు, తర్వాత ఆ కుక్క ఆ (fence) కంచె దాటి వెళ్లే ప్రయత్నం life లో చేయదు, దీనినే habitual conditioning అంటారు. అలాగే ఒక ఏనుగు కావొచ్చు, ఎద్దు కావొచ్చు, గుర్రం కావొచ్చు ఒక చిన్న తాడుతో కట్టిపడేస్...