(pic source:enaadu.net) ప నిమీద రోడ్డుపై వెళుతూ ఉంటాం. ఒకతను రిక్షాను ఎత్తుకు లాగలేక అవస్థ పడుతూ ఉంటాడు. అది చూసిన మనం రిక్షా వెనక ఓ చెయ్యి వేసి తోసి సహాయం చేయడానికి వెనకాడతాం. ఎవరైనా చూస్తారన్న నామోషీ. చూస్తే అవతలి వాళ్లకు తమ పట్ల చులకన భావన కలుగుతుందన్న జంకు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం తప్పేమీ కాదు. నెయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలంటారుగాని- సహాయం చేయడానికి, పొందడానికి కాదు. పనిమనిషి తన ఇంట్లో ఏదో పని ఉండటం వల్లో, తనకో తనవాళ్లకో ఒంట్లో బాగుండక ఒక్క రోజు రాకపోతే మరుసటి రోజు ఆమెపై మనం వ్యక్తం చేసే అసహనం అంతా ఇంతా కాదు. ఆమె అందరిలాంటిదే. కాలం కలిసిరాక గుట్టుగా నాలుగు ఇళ్లలో పనిచేస్తూ గౌరవంగా పొట్టపోసుకుంటోంది. గత్యంతరం లేక- ఇంటివారి పెడసరపు మాటలు భరిస్తుంది. బాధను దిగమింగుకుంటుంది. జానెడు పొట్ట నింపుకోవడానికి పిడికెడు ముద్ద కావాలి కదా! ఆమె మరమనిషి కాదు. మిగతావారిలాగే ఆమెకూ బరువు బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా మనసు ఉంటుంది. ప్రేమతో పరమాణ్నం పెట్టడమే కాదు కోపంలో సహనం చూపించగలిగితేనే ఆమె మనింటి సభ్యురాలవుతుంది అన్నది మరవక...