మతవిమర్శ చేయాల్సినప్పుడు నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, అధ్యయనం చేయాల్సి న అంశాలు: 1. Being Politically Correct: చేసే వాదన ఏదైనా కానీ, భాషలో, భావంలో కుల, వర్ణ, లింగ, ప్రాంత, భాషా వివక్షలు ఉండకూడదు. మనం నివశించే ప్రాంతపు చట్టాన్ని అది అతిక్రమించకూడదు. 2. ప్రతివాది వాదం ఎంత దిగజారినదైనా మర్యాదపూర్వక సంబోధన కలిగి ఉండాలి. 3. చుట్టూ ఉన్న గుంపు చేసే కేరింతలూ, అరుపుల నడుమ సెన్సేషనల్ డైలాగులు కొట్టి వాళ్ళను అలరించాలనే కుతి వదులుకోవాలి. ఆనక అరెస్ట్ అయితే వాళ్ళెవరూ తోడురారు. 4. ఏదైనా ముతకగా చెప్పాలని బాగా దురద ఉంటే వ్యక్తులూ, దేవుళ్ళూ, మతాల పేర్లను యథాతథంగా వాడకుండా కాస్త మార్చి కొంచెం కోడెడ్ భాషలో (జంతువులు కథలు మొదలైనవి) మాట్లాడటం నేర్చుకోవాలి. 5. సాధ్యమైనంత వరకూ మతాలను చేసే హేళనలో ఆ మతాల పవిత్ర గ్రంధలనూ, వాటిమీద గతంలో ప్రముఖులు చేసిన కామెంట్లను రిఫరెన్సులుగా వాడితే ఆ దోషం వాళ్ళమీదకే పోతుంది. కాబట్టి ఆయా గ్రంధాలలో రాసిన ముడిసరుకును బట్టీపట్టి ఉండటం అవసరం. 6. అన్నిమతాలూ లైంగికత విషయంలో లేకి థియరీలు చెప్పేవే. కానీ అదే విషయాన్ని ...