Skip to main content

Posts

Showing posts from June, 2020

సంయమనం

ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపైన దాడి చేస్తుందనుకొని,  వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా ఉపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని  నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే  తెచ్చుకొంది. మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి  అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది. _జీవితంలో ప్రశాంతంగా  ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని  పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్నిసార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

నాలుగు మాటలు

ఎవడి బతుకు వాడు బతికేస్తున్నాడు.. పక్కోడు అస్సలు పట్టడు.. ఎంత కాడికీ నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నాను.. నువ్వేం కొనుక్కున్నావు.. నేనేం కొనుక్కున్నానూ వంటి కంపేరిజన్లూ, ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నువ్వే అనుభవిస్తున్నావన్న ఈర్ష్యా.. చెప్పేవాడు లేక జీవితాలు జీవితాలు నాశనం అవుతున్నాయి. మనం చెప్పినా ఎవడూ వినట్లేదని చాలా కన్వీనియెంట్‌గా చేతులు ఎత్తేసి సినిమాలు చూస్తున్నారు పెద్ద వాళ్లంతా. పెద్దా చిన్నా తేడా లేదు. మనిషికీ మనిషికీ మధ్య గౌరవాలు లేవు. ఎవడిష్టమొచ్చినంత మాటా వాడు అనేస్తాడు. చదువూ, సంస్కారం ఏమీ ఉండవు. మనకన్నా చిన్న వాళ్లకి నాలుగు మంచి మాటలు చెప్పాలన్న థాట్ కూడా ఎవరికీ ఉండదు. ఎంతసేపటికీ మనమూ యూత్‌లా అయిపోదామనే యావ తప్పించి! అబ్బాయిలకూ, అమ్మాయిలకూ పోటీగా అందంగా కనిపించడం కోసం.. అయిపోతున్న వయస్సుని, మనస్సులో పేరుకుపోతున్న ఇన్‌సెక్యూరిటీని కవర్ చేసుకోవడం కోసం వెధవ తాపత్రయాలు తప్పించి! నువ్వు యూత్‌గా చెలామణి అయ్యే దానికన్నా నువ్వు నీకంటే చిన్న వాళ్ల పట్ల బాధ్యతగా ప్రవర్తించేటప్పుడు వచ్చే respect ఎక్కువ. ఎన్ని పూసుకున్నా.. ఎంత కవర్ చేసుకున్నా ఇంత లావు పొట్టా.. మొహంలో ముడత...

జీవితంలో...!

1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. 2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. 3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి. 4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. 5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. 6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు. 7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. 8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. 9. ఉపాయాన్ని అలోచించేటప్పుడే రాగల అ...

పండగ అంటే

పండగ అంటే  పరమాన్నం వండుకోవటం పట్టుబట్టలు కట్టుకోవటం పదిమందికి శుభాకాంక్షలు చెప్పటం కాదు. పండుగ అంటే  పాత ఆలోచలని వదిలెయ్యటం. పండుగంటే 'నిన్న 'నుండి 'నేటికి ' మారటం. మానసిక, శారీరక ఆరోగ్యం , రక్తదానం, నేత్రదానం, మద్యపానం నిషేధం పట్ల కనీసం నీకు నువ్వయినా 'అవగాహన' కలిగించుకోవటం,  ఓ పచ్చటి మొక్కకు ప్రాణం పొయ్యటం. చరిత్రలో నీకో కొత్థ పేజీ సృష్టించుకోవటం. నీ బాధ్యతను పునర్నిర్వచించటం. నువ్వు 'పునరుజ్జీవనం' చెందిన ప్రతీ రోజూ పండగే. అలాంటి పండుగ కోసం నేను ఎప్పుడూ సిద్ధం. మరి నాతో కలసి నడుస్తావా?

10 Successful habbits

https://youtu.be/bwwrCluruqE Life's three golden lessons. 1.  Never poke a person/thing lying peacefully 2.  Never argue unnecessarily 3.  Never try to prove your point unnecessarily

ఏదీ శాశ్వతం కాదు

ఏ జీవితం శాశ్వతం కాదు.. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. జీవించే కొంత కాలానికి ఎన్నో బాధలు,బంధాలు, బాధ్యతలు, ప్రేమలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాం. బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాం. రేపు అనే దాన్ని చూస్తామో,          లేదో తెలియని మన బతుకులకు పగలు,కక్షలు పంతాలు  ఎందుకు? ఎవరూ ఉండి తినేది లేదు. పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలంలో అందరితో కలసి సంతోషంగా జీవిద్దాం.  మనల్ని ప్రేమించేవారిని ప్రేమిద్దాం.

BankniftyMovement

How to judge BankniftyMovement ? Bank Nifty is one of the important indices which comprises of the most liquid and large Indian Banking stocks. Lagging and leading behavior of Bank Nifty can help us to gauge the strength or weakness of the ongoing trend in Nifty. In fact, the Bank Nifty Index is positively influencing almost all the sectoral indices of NSE in both bull and bear phase market movements. Hence before making any investments in the equity market, the investing and trading community must look into the behavioural pattern of banking sector stocks as they influence the behaviour of other sector stocks too and do investments or trade accordingly. The judgement of index movement is depend on Fundamental and technical factor. Fundamental Factors:  1. Bond Yield Movement: When a country’s macro-economic situation (CPI, GDP, trade Balance, and fiscal deficit ) deteriorates, bond prices fall and bond yields rise. For stock market investor point of view, Rising bond yields erode ...

అందరూ బాగుండాలి

అందరూ బాగుండాలి  నల్లప్ప వంకాయ సాగు చేస్తున్నాడు. కానీ పంటకు బాగా పురుగు పట్టింది. పంట ను కాపాడటానికి  రకరకాల మందులు పురుగుమందులమ్మే అంగళ్ళ నుంచి  మందులు తెచ్చి వాడుతున్నాడు. అయినా అవి తగ్గినట్టే తగ్గి మరలా వస్తున్నాయ్. ఇంత ఖర్చు చేస్తున్నా దిగుబడి రాక పోతే వచ్చే నష్టాన్ని తలుచుకుని బాగా దిగులు పడుతున్నాడు.  మంచంలో కదల లేని పరిస్థితుల్లో ఉన్న వెంకట్రామయ్య తాత, తన మనవడు నల్లప్ప ఆందోళనను గమనించాడు. "ఏరా అబ్బి, నీలో నువ్వే బాధ పడతాండావు?" అని అడిగాడు. ఏం లేదు తాతా "వంకాయ   పంటకు, ఎన్ని పురుగు మందులు చల్లినా  మరలా పురుగులు వస్తున్నాయి, ఏంచేయాలో తోచడం లేదు." దిగులుగా చెప్పాడు. అప్పుడు తాత "ఓరి వెర్రోడా! నువు మందు వాడగానే కొన్ని పురుగులు చనిపోతాయి. కొన్ని ప్రక్క వాడి పొలము లోనికి వెళ్తాయి.మందు పవర్ ఐపోగానే ప్రక్క వాడి పొలం లో పురుగు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి నీ పొలం లోకి వస్తాయి. కనుక నువు ఏ మందు వాడుతున్నావో  పక్కోనికి కూడా చెప్పాలి.అతను కూడా వాడేటట్లు సహాయం చెయ్యాలి.అప్పుడు అందరు రైతులు వారి వారి పొలాలలో  మందు వాడినందు వల్ల   అందరూ సుభిక్ష...

మానవీయ జీవన విధానం

మతం పునాదిగా మనుషుల్ని వేలాది సంకుచిత విభాగాలుగా విభజించిన కులభావాలను  వదలించుకోవాలి. ఆధునిక విజ్ఞానం వెలుగులో హేతుబద్దంగా ,కార్యకారణ బద్ధంగా, వివేకంతో వివేచన చేయాలి. హేతువిరుద్ధమైన భావాలను  ప్రశ్నించాలి. వాటిని తిరస్కరించాలి. సంకుచితమైన  జాతి,కుల,వర్గ,లింగ భావాలను వదలించుకోవాలి. ఏదో గ్రంథం చెప్పిందనో, ఎవరో చెప్పినారనో కాక స్వతంత్రంగా ఆలోచించాలి. మనిషికి అంతిమ ప్రమాణం హేతుబద్ధ ఆలోచనే. విశ్వమంతా నియమబద్ధంగా పరిణామశీలం కలిగిఉంది. ఈ అవగాహన లో భాగమే ఆధునిక విజ్ఞానం. విశ్వమంతా పలు సంఘటనల మయం.ఒక సంఘటన మరొక సంఘటనకు కారణమవుతుంది.అదొక నిరంతర ప్రక్రియ. ఈ కార్యకారణ అవగాహనే జ్ఞానానికి తద్వారా సత్యావిష్కరణ కు దారి చూపుతుంది. మానవుడి లక్ష్యం స్వేచ్ఛ. ప్రకృతి దౌష్ట్యాలనుండి , సంకుచిత సమిష్టుల నుండి, మార్మిక సిద్ధాంతాలనుండి , పక్షపాత రాజకీయ పార్టీల నుండి, మనుషుల క్రూరత్వంనుండి , నిరుద్యోగం, దారిద్ర్యం, ఆకలి లేని   స్వేచ్ఛా ప్రపంచం మనిషికి అవసరం. సమాజాన్ని తన శ్రేయస్సుకోసం మనిషి రూపొందించుకున్నాడు. సమాజంకోసం మనిషి బలికారాదు. మనిషి కోసంసమాజం, సమాజం కోసం మనిషి  ఇదొక నిరంతర ప్...

ఆనందానికి 6 అంశాల సూత్రం

ఉదయం 8 లోపు చేసే 6 పనులు మన జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫష్టంగా చెప్పాడు.హాల్ ఎలోర్డ్ అనే ప్రముఖ రచయిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అవేమంటే  నిశ్శబ్దం ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి.. లేవడం లేటయ్యింది… అయ్యో ఎలా…? ఆఫీస్ పని… ఈ రోజు అతడిని కలుస్తానని చెప్పాను…ఏమోయ్…టిఫిన్ అయ్యిందా.. ఇదిగో ఇంతలా హైరానా పడొద్దు… ప్రశాంతంగా లేవగానే.. కాసింత సేపు మెడిటేషన్ చేయండి.. లేదా…కళ్లు మూసుకొని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది..  నీతో నువ్వు మాట్లాడుకోవడం  అందరి గురించి, అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే మనం.. మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేక పోతున్నాం..  అసలు మనలోని మనకు ఏం కావాలి.? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్లల్లో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్రతి రోజు మీతో మీరు మాట్లాడుకోండి. 1) నేనేమి కావాలనుకుంటున్నా.? 2)దాని కోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న? 3) అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలి వెయ్యాలి.? వేటిని కొత్తగా ఆహ్వానించాలి.? ఇలా ప్రతి రోజూ మనలో మ...

నమ్మకం

ఆశావాదము   ఆత్మవిశ్వాసము ఒక వ్యాపారస్తుడు  తన వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చి అప్పులపాలు అయ్యాడు . బయిటకు పడే మార్గం లేక నిరాశవాది అయ్యాడు. పార్కుకు వచ్చి బెంచీ మీద దిగులుగా కూర్చున్నారు . తనను ఎవరైనా ఈ కష్టము నుంచి బైట పడేస్తారా అని విచారిస్తూ కూర్చున్నాడు . ఇంతలోనే  ఒక ముసలాయన వచ్చి అతను దిగులుగా వుండటం చూసి విషయం ఏంటని అడిగి, సంగతి తెలుసుకున్నాడు . తరువాత ముసలాయన ఇలా  అన్నాడు . “నేను  నీకు సహాయపడగలనని అనుకుంటున్నాను. ” వెంటనే  తన జేబు లో ఉన్న చెక్ బుక్ తీసి వ్యాపారి పేరు అడిగి కొంత పైకం చెక్ మీద వ్రాసి దాన్ని,  వ్యాపారి చేతిలో పెడుతూ ఇలా అన్నాడు .”ఈ డబ్బు తీసుకో! సరిగ్గా , ఏడాది తరువాత మనము ఇదే పార్కులో ఈ బెంచీ దగ్గరే  కలుసుకుందాం . అపుడు నా ధనం చెల్లించుదువు గాని ” అన్నాడు . వెంటనే ఆ పెద్దమనిషి అక్కడనుంచి వెళ్ళిపోయాడు .      ఆ చెక్ పై 5000,000 డాలర్స్ అమౌంట్ వేసివుంది. క్రింద సంతకం, ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుడైన రాక్ ఫెల్లర్   అని ఉంది . వ్యాపారి “నా బాధలు ఇప్పుడీ నిమిషంలో తీరిపోతాయి “అని అతనికి ఆస కలిగింది.కానీ,అతడు ఆ ...

Conditioning

కొత్త గా ఇంటికితెచ్చిన కోడిని ఇంటి ఆవరణకు అలవాటు చేయడానికి, ఒక వారం రోజుల పాటు, ఒక గుంజెకు తాడుతో కట్టేస్తారు, తర్వాత దాన్ని విడిచిపెట్టినా ఊరు మొత్తం తిరిగి తిరిగి చీకటి పడే ముందు అదే ఇంటికి వచ్చి గంప చుట్టూ తిరుగుతది కానీ పారిపోదు ఎందుకంటే దాన్ని అలా conditioning చేశారు.  ఎంత అంటే పంజరంలో ఉన్న చిలుక ఎగురుతున్న పక్షుల్ని చూసి వాటికి ఏదో రోగం వచ్చింది కావొచ్చు అనుకునే అంత conditioning చేస్తారు. Ex:- సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు బాగా ఫాలో అయ్యే ఒక మహిళ, ఎవరైనా న్యూ జనరేషన్ అమ్మాయి ఇలాంటివి ఫాలో అవ్వకుండా తనకు నచ్చినట్టు తాను బ్రతికితే బరితెగించి బ్రతుకుతుంది అంటారు, కానీ వారు మాత్రం అందమైన పంజరంలో జీవిత ఖైదు అయ్యాము అని మాత్రం ఒప్పుకోరు.. అదే విధంగా Western countries లో, కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్కను కొన్ని రోజుల పాటు ఇంటి ఆవరణలో ఒక fence వేసి పెడతారు, తర్వాత ఆ కుక్క ఆ (fence) కంచె దాటి వెళ్లే ప్రయత్నం life లో చేయదు, దీనినే habitual conditioning అంటారు. అలాగే ఒక ఏనుగు కావొచ్చు, ఎద్దు కావొచ్చు, గుర్రం కావొచ్చు ఒక చిన్న తాడుతో కట్టిపడేస్తే అక్కడే పడి ఉంటాయి, కానీ సంకెళ్ళు తెం...

improve your emotional intelligence

Most people think about emotional intelligence as a skill, something you can build and train with practice. And while this is partly true, there’s a deeper truth about emotional intelligence that most of us miss: Improving your emotional intelligence is often about what you do less of, not more of. As a psychologist, I work with many people who look like though they don’t have much emotional intelligence: They blame other people for their problems They trap themselves in cycles of stress and anxiety They self-sabotage as soon as they start to make progress But it’s my experience that most people don’t actually lack the capacity for emotional intelligence. In fact, I think most people already have a high degree of emotional intelligence. Unfortunately, many people are held back from using their innate emotional intelligence by a collection of bad habits that get in the way. If you’d like to improve your emotional intelligence, learn to identify these habits in your own life and work to ...

ప్రశంసించండి

పదిమందిలో ప్రశంసించండి.అద్భుతాలు జరుగుతాయి. 🤝పిల్లలు మెరుగువ్వాలంటే , పిల్లల్లోని సుగుణాన్ని ఇతరులకి చెప్పేటప్పుడు వారికి వినపడేటట్లు చెప్పడమే          🍀మీరు ఇప్పటికే పిల్లలను ప్రశంసించే అలవాటు ఉంటే ,అది పిల్లలు ఎమోషనల్ గా ,ఆరోగ్యంగా పెరగడానికి గొప్ప పునాది . ఒకవేళ లేకపోయినా మొదలు పెట్టడానికి ఇప్పటికి ఆలస్యం కాదు .           🌸ప్రశంస ఆత్మ  ఔన్నత్యం ,విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహద పడుతుంది .పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పొగడని క్షణమంటూ ఉండదు. అంత ముద్దు చేసేవారు ,పిల్లలు  పెరిగేకొద్దీ నిబంధనలు, విమర్శలు ,హితబోదలు పెరిగి ప్రశంసించడం ,ప్రోత్సహించడం తగ్గుతున్నాయి .పదిమందిలో ప్రశంసించాలి .ఒంటరిగా ఉన్నప్పుడు వివరించాలి .         🤝చేతలతో ప్రశంసించండి : అన్ని సార్లు మాటలే కాకుండా చేతలతో (గిఫ్ట్స్)ప్రశంసించండి .       🍁ఉదాహరణ:తన గది శుభ్రం చేసుకున్నప్పుడో, తల్లికి సహాయం చేసినప్పుడో ,దీనిలో అయినా ప్రతిభ కనపరిచినప్పుడో ,కేవలం అభినందనలే కాక, వారికి అత్యంత ఇష్టమైన సర్ప్రైజ్ గిఫ్ట...

బతుకుబాట

కోపాన్ని అదుపు లో పెట్టుకోవడం ఎంత కష్టమో..  సహనాన్ని అలవరచుకోవడం కూడా అంతే కష్టం.!    కానీ..  బతుకుబాట లో విజయం సాధించాలంటే పోరాటం తప్పదు..! కాలచక్రంలో వచ్చే పెనుమార్పులను జీర్ణించుకునే మనస్తత్త్వాన్ని అలవరచుకోవాలి.!  ఈ రోజెలా గడుస్తుందోనన్న ఆలోచన మనిషిని నిలువునా కృంగదీస్తుంది.! సరైన ఆలోచన జీవనపధాన్నే  మార్చివేస్తుంది. మనసంతా  దిగులుతో నిండినా ఆశావహ దృక్పధాన్ని అవలంబించాలి. నిరాశ, నిస్పృహలు గుండె లోతుల్లోకి దరి చేరనివ్వకూడదు. ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి.. ధైర్యాన్నెప్పుడూ కోల్పోకూడదు.   జీవితం మీద విశ్వాసం కోల్పోతున్నప్పుడు గుండె ను సవరదీసి ధైర్యం చిక్కబట్టుకోవాలి.! 

చెత్త తొలగించండి

అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి , రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులలో నుండి పాడైనవి...  కుళ్ళిపోయినవి తీసేస్తాడు.నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.* *మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు.వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు.* *'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది...'* *_జీవితానుభవాలు అంతే..._* *బాధ కలిగించే ఆలోచనలను,  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి...* *ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి...క్షమించాల్సిన వాటిని క్షమించాలి...సానుభూత చూపాల్సిన వారిపై సానుభూతి చూపాలి... విస్మరించిన వాళ్లను విస్మరించాలి... ప్రశంసించిన వాళ్లను ప్రశంసించాలి...* *మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి...* *చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది

Rich people thinking ways

21 ways rich people think differently than average people : 1 Average people think money is the root of all evil. Rich people believe poverty is the root of all evil. 2 Aveeage people think selfishness is a vice. Rich people think selfishness is a virtue. 3 Average people have a lottery mentality. Rich people have an action mentality. 4 Average people think the road to riches is paved with formal education. Rich people believe in acquiring specific knowledge. 5 Average people long for the good old days. Rich people dream of the future. 6 Average people see money through the eyes of emotion. Rich people think about money logically. 7 Average people earn money doing things they don't love. Rich people love their passion. 8 Average people set low expectations so they are never disappointed. Rich people are up for the challenge. 9 Average people believe you have to DO something to get rich. Rich people believe you have to BE something to get rich. 10 Average people believe you need mon...

విమర్శించకండి

విమర్శించకండి విమర్శించకసోవదం వల్ల మీ దృష్టి ఇతరుల విషయాలపైకి మళ్లుతుంది. విషయాల సైకి మళ్ళుతుంది. విమర్శ ఎదుటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారు మీ ఆత్మ విశ్వాసౌన్ని దెబ్బకొట్టే ప్రయత్నం తప్పక చేస్తారు. జాగ్రత్త, విమర్శించకపోతే ఎదుటివారి హృదయాలు గాయపడవు, వారు మీ గురించి అనుకూలంగా ఆలోచిస్తారు. అది మీకు మంచిని కలుగజేస్తుంది. 'మీకు యిష్టం లేనిది - ఇష్టం లేదు' అని సష్గంగా చెప్పండి.  మీ యిష్టాయిష్టాలు, వ్యక్తిత్వం గురించి ఇతరులకు స్పష్టంగా తలుస్తుండది. మీతో ఎలా మసులుకోవాలో వారికి అర్థం అవుతుంది. మీ అంతరంగం మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎలాంటి పని ఎంచుకోవాలో - ఎలాంటి లక్ష్యం ఏర్పరచుకుంటే మీకు విజయం లభిస్తుందో మీకు తెలిసిపోతుంది. మీకంటే పెద్ద స్థాయిలో వున్నవాళ్ళపై ఎంత గౌరవం అభిమానం చూపుతారో - చిన్న స్థాయిలో వున్న వాళ్ళపై కూడా అంతే గౌరవం అభిమానం చూపండి. అందర్నిసమంగా చూడడం వల్ల మీరు ఎవరి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా మారుతారు.  చిన్నస్థాయిలో వున్న వారిపై మీరు చూపే అభిమానానికి రెట్టింపు అభిమానం వారు మీ పట్ల కనపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అవసరానికి మించి ఒక్కమాట కూ...

ఉన్నత లక్షం

మీ మనస్సులో మీరు ఇతరులను తప్పుగా ఆలోచించి వుంటే ఎప్పుడో ఒకసారి అది ఏదోరూపంలో బయటపడితీరుతుంది. తద్వారా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయగల ఓ శ(తువుని చేసుకున్నవాళ్ళవుతారు. పగ ప్రతీకారం ఈర్ష్య అసూయ అసహ్యం విజయానికి శత్రువులు ఇవన్నీ మీకు ఎక్కువ హాని కలుగజేసేవి, ఇవి మీ మనస్సులో ఏ మూల ఉన్న న - మీ ప్రశాంతతను భగ్నపరిచి - మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి.  మీ జీవిత లక్ష్యాలను మీరుకాక - అవి నిర్దేశిస్తాయి. అగాధాల్లోకి తోసివేస్తాయి. క్షమాగుణం” అలవరుచుకుంటే - మీకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రశాంతమైన మనస్సులో నుండే విజయభేరి వినిపిస్తుంది. మీకు నచ్చిన పని తీరు బాగానే చేస్తారు.  కాని ప్రతి పని మీకు నచ్చేట్లు చేయడమే విజయరపహస్యం. మీకు నచ్చనివి - మీకు చిన్న చిన్న పనులుగా అన్పించినవి మీరు అరకొరగా చేసారంటే - అవి మీ విజయం పై ప్రభావం చూపిస్తాయి. ప్రతి చిన్న పని శ్రద్ధగా - మీకు సంతృప్తి: కలిగేట్లు చేస్తే". విజయం మీకు దగ్గరవుతుంది జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుగుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం. 'ప్రతివారు తమ జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఏర్పరచుకోవాలి అది చాలా వున్నతంగా వుండాలి. ఉన...

జీవితం లో అద్భుతాలు జరగాలి ,

🍏 రేపే దో జరగ బోతుందని... ఇప్పటి నుండే చింతించకు... చివరి క్షణం వరకు మంచిగా  జీవిస్తుంటే ఏక్షణం లో నైనా అద్భుతాలు  జరగ వచ్చు.  ఎవరికి తెలుసు..!! 🍏జీవితం లో అద్భుతాలు జరగాలి , జీవితమే అద్భుతంగా ఉండాలి. అను కుంటే దానికి తగిన విధంగా మన ఆలోచనలను,  మనల్ని... మనం మలచు కోవాలి..!! 🍏ఇప్పుడు... నీకు ఉన్న భాధ  నీ పరిస్థితుల కంటే ఎక్కువగా వాటిని చూసే విధానం  సరిగా  లేక పోవటం వల్లే వస్తూ ఉంటుంది. సరి చూసు కోవాలి..!! 🍏అతిగా విమర్శ చేస్తూ కాలం గడపకు. ఎందు కంటే... తిరిగి తిరిగి అదే ఆలోచూస్తూ... కూర్చుంటే  ఏదో ఒక రోజు  అదే నీ జీవితం లోకి వస్తుంది..!! 🍏నిన్ను కోల్పోయే త్యాగాలు చేయ నక్కర లేదు. ఎవరి కోసమూ... అందరికీ... వీలైనంత సహాయమూ, సహకారమూ చేస్తే అదే పదివేలు..!! 🍏ప్రపంచానికి ఇప్పుడు... ఎక్కువగా అవసర మన్నది. పరిస్థితులలో మార్పు కాదు.  చైతన్యం లో మార్పు... మిగిలింది. అదే చూసు కుంటుంది..!! . 🍏అతిగా ఆలోచించడం కూడా ఒక రకమైన జబ్బే. మెల్లగా ప్రయత్నించి ఈ విచిత్ర జబ్బు నుండి కూడా బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!! . 🍏 మిమ్మల్ని మీరు ఇస్ట పడడమే విజయం...! ...

సానుకూల దృక్పథం

వజ్రం లాంటి జీవితం కోసం_5 _________________________ సానుకూల దృక్పథాన్ని పెంచుకునే ఆలోచనలు 1 మనం ఎంత ప్రయత్నించినా వేరే  విధంగా జరుగుతున్నప్పుడు ఏమి జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి 2 నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది .అందువల్ల మనం జాగ్రత్తగా మాట్లాడాలి. 3. మనం సరిగ్గా ఉంటే ప్రపంచం కూడా సరిగ్గా ఉంటుంది 4. మంచి వాళ్లకు ఆపదలు వచ్చినా వాటి వల్ల వారు ఎదుగుతారేగాని కుంగిపోరు 5.  జీవించడంఒక కళ. దాన్నెవరూ ఆపలేరు. అనుభవాల కన్నా మించిన ఉపాధ్యాయుడు ఎవరూ లేరు. అందుకే అనుభవమైతే గానే తత్వం బోధపడదు అంటారు. 6.జీవితం ఒక సాహసకృత్యం కావాలి .కానీ అనామకంగా ఉండరాదు. 7.ఉద్రేకాలను అదుపులో చేసుకున్నవాడే జీవితంలో ఆనందంగా ఉండగలడు 8. ఓపిగ్గా ఉండి పని చేస్తూ పోతే విజయం తప్పక వరిస్తుంది 9.  i am ok you are ok ఈ సూత్రాన్ని నిత్యం పాటించాలి   _________________________                          _                       _పిళ్లా విజయ్ _________________________

ACT Formula

వజ్రం లాంటి జీవితం కోసం _________________________ ACT Formula A__ Acknowledge అంగీకారం C ___Choose ఎంపిక T____Track మార్గాన్ని గుర్తించడం యాక్ట్ ఫార్ములాను పాటించాలి. మార్పును అంగీకరించి మారడానికి సిద్ధపడాలి. లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గాన్ని గుర్తించాలి.ఈ పనులన్నీ చేసిన తరువాత కార్యాచరణ అనేది చాలా ముఖ్యమైనది. అప్పుడే లక్ష్యాన్ని చేరగలం. _________________________                                                     _______________పిళ్లావిజయ్

నాయకత్వ లక్షణాలు

వజ్రం లాంటి జీవితం కోసం_10 _________________________ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి మార్గాలు 1 ప్రగతి సాధిస్తున్న వ్యక్తిని బాగా పొగడాలి. ప్రోత్సహించాలి .ఇదేనా నీ ప్రగతి అని ఎగతాలి చేయరాదు. 2.తన అవసరాలను కాదు తన అనుయాయుల అవసరాలను గుర్తించిన వాడే నిజమైన నాయకుడు. 3.ద్వేషం భయం నేర మనస్తత్వం ఉండరాదు. ఇవి ప్రమాదకర శత్రువులు. 4.వ్యాపారంలో మూడు ముఖ్యమైన విషయాలు అవసరం .అవి ఒకటి ధైర్యం రెండు ధైర్యం  మూడు ధైర్యం. 5.బద్ధకం వదలాలి .రేపు చేద్దాం అన్నది ఇవాళ చేయాలి .అది ఎన్నో అద్భుతాలు చేస్తుంది. బద్దకాన్ని వదిలిస్తుంది. 6.మీరు ఇతరులను మార్చాలంటే ముందు మీరు మారాల్సి ఉంటుంది. మీరు మారి ఆచరిస్తే ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు. 7.మీరు చేస్తున్న పని వల్ల అనుకున్న ఫలితం రాకపోతే పాత పద్ధతులను వదిలిపెట్టి కొత్త పద్ధతులను ప్రయత్నించాలి. 8.నాయకునికి తప్పనిసరిగా లక్ష్యం ఉండాలి. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉండాలి. 9.ఎంత ఒత్తిడి ఉన్నా హుందాగా ప్రవర్తించాలి ఒత్తిడిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించడమే నిజమైన నాయకత్వ లక్షణమని జోసెఫ్ కెన్నెడీ అన్నారు. _________________________        ...