Development is a Culture
అభివృద్ధి అనేది...
ఆలోచన విధానంలో ఉంటుంది.
ప్రణాళికలో ఉంటుంది.
ధనాన్ని ఉపయోగించే పద్ధతిలో ఉంటుంది.
అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసే తీర్పులో ఉంటుంది.
సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో తెలిపే దృక్పథంలో ఉంటుంది.
అభివృద్ధి అనేది...
భౌతిక వనరుల దాటి మనసు స్థాయికి సంబంధించిన విషయం. ఇది సంస్కృతిగా పరిగణించాలి.
ఇది ఒక కుటుంబంలో పిల్లలకు చిన్నప్పటినుంచి నేర్పవలసిన జీవన శైలి.
పరిశుద్ధత, పట్టుదల, ప్రణాళిక, పరస్పర సహకారం, బాధ్యతా పూరిత జీవన విధానం — ఇవన్నీ కలసి అభివృద్ధి సంస్కృతిని ఏర్పరుస్తాయి.
దీరూబాయ్ అంబానీ వారసత్వం ఇద్దరికీ సమానంగా వచ్చిందేమో కానీ... అభివృద్ధిని చూసే దృక్పథం మాత్రం ఒక్కరిలో మాత్రమే బలంగా వృద్ధి చెందలేదు. అందుకే తేడా వచ్చింది.
ఇప్పటి యువతలో చాలా మందికి అవకాశాలు ఉన్నాయి... కానీ అభివృద్ధి కల్చర్ ను అలవరచుకోవాలనే ఆలోచన తక్కువగా కనిపిస్తోంది. ఈ భావనను అందరికీ బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
__ పిళ్లా కుమారస్వామి,9059054756
Comments
Post a Comment