కోపాన్ని అదుపు లో పెట్టుకోవడం ఎంత కష్టమో..
సహనాన్ని అలవరచుకోవడం కూడా అంతే కష్టం.! కానీ..
బతుకుబాట లో విజయం సాధించాలంటే పోరాటం తప్పదు..!
కాలచక్రంలో వచ్చే పెనుమార్పులను జీర్ణించుకునే మనస్తత్త్వాన్ని అలవరచుకోవాలి.!
ఈ రోజెలా గడుస్తుందోనన్న ఆలోచన మనిషిని నిలువునా కృంగదీస్తుంది.!
సరైన ఆలోచన జీవనపధాన్నే మార్చివేస్తుంది.
మనసంతా దిగులుతో నిండినా ఆశావహ దృక్పధాన్ని అవలంబించాలి.
నిరాశ, నిస్పృహలు గుండె లోతుల్లోకి దరి చేరనివ్వకూడదు. ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి..
ధైర్యాన్నెప్పుడూ కోల్పోకూడదు.
జీవితం మీద విశ్వాసం కోల్పోతున్నప్పుడు గుండె ను సవరదీసి ధైర్యం చిక్కబట్టుకోవాలి.!
Comments
Post a Comment