పండగ అంటే
పరమాన్నం వండుకోవటం
పట్టుబట్టలు కట్టుకోవటం
పదిమందికి శుభాకాంక్షలు చెప్పటం కాదు.
పండుగ అంటే పాత ఆలోచలని వదిలెయ్యటం.
పండుగంటే 'నిన్న 'నుండి 'నేటికి ' మారటం.
మానసిక, శారీరక ఆరోగ్యం , రక్తదానం, నేత్రదానం, మద్యపానం నిషేధం పట్ల కనీసం నీకు నువ్వయినా 'అవగాహన' కలిగించుకోవటం,
ఓ పచ్చటి మొక్కకు ప్రాణం పొయ్యటం.
చరిత్రలో నీకో కొత్థ పేజీ సృష్టించుకోవటం.
నీ బాధ్యతను పునర్నిర్వచించటం.
నువ్వు 'పునరుజ్జీవనం' చెందిన ప్రతీ రోజూ
పండగే.
అలాంటి పండుగ కోసం నేను ఎప్పుడూ సిద్ధం.
మరి నాతో కలసి నడుస్తావా?
Comments
Post a Comment