వజ్రం లాంటి జీవితం కోసం_10
_________________________
నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి మార్గాలు
1 ప్రగతి సాధిస్తున్న వ్యక్తిని బాగా పొగడాలి. ప్రోత్సహించాలి .ఇదేనా నీ ప్రగతి అని ఎగతాలి చేయరాదు.
2.తన అవసరాలను కాదు తన అనుయాయుల అవసరాలను గుర్తించిన వాడే నిజమైన నాయకుడు.
3.ద్వేషం భయం నేర మనస్తత్వం ఉండరాదు. ఇవి ప్రమాదకర శత్రువులు.
4.వ్యాపారంలో మూడు ముఖ్యమైన విషయాలు అవసరం .అవి ఒకటి ధైర్యం రెండు ధైర్యం మూడు ధైర్యం.
5.బద్ధకం వదలాలి .రేపు చేద్దాం అన్నది ఇవాళ చేయాలి .అది ఎన్నో అద్భుతాలు చేస్తుంది. బద్దకాన్ని వదిలిస్తుంది.
6.మీరు ఇతరులను మార్చాలంటే ముందు మీరు మారాల్సి ఉంటుంది. మీరు మారి ఆచరిస్తే ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు.
7.మీరు చేస్తున్న పని వల్ల అనుకున్న ఫలితం రాకపోతే పాత పద్ధతులను వదిలిపెట్టి కొత్త పద్ధతులను ప్రయత్నించాలి.
8.నాయకునికి తప్పనిసరిగా లక్ష్యం ఉండాలి. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉండాలి.
9.ఎంత ఒత్తిడి ఉన్నా హుందాగా ప్రవర్తించాలి ఒత్తిడిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించడమే నిజమైన నాయకత్వ లక్షణమని జోసెఫ్ కెన్నెడీ అన్నారు.
_________________________
_______________పిళ్లావిజయ్
Comments
Post a Comment