మీ మనస్సులో మీరు ఇతరులను తప్పుగా ఆలోచించి వుంటే ఎప్పుడో ఒకసారి
అది ఏదోరూపంలో బయటపడితీరుతుంది.
తద్వారా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయగల ఓ శ(తువుని చేసుకున్నవాళ్ళవుతారు.
పగ ప్రతీకారం ఈర్ష్య అసూయ అసహ్యం విజయానికి శత్రువులు
ఇవన్నీ మీకు ఎక్కువ హాని కలుగజేసేవి, ఇవి మీ మనస్సులో ఏ మూల ఉన్న న
- మీ ప్రశాంతతను భగ్నపరిచి - మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి.
మీ జీవిత లక్ష్యాలను మీరుకాక - అవి నిర్దేశిస్తాయి. అగాధాల్లోకి తోసివేస్తాయి.
క్షమాగుణం” అలవరుచుకుంటే - మీకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రశాంతమైన
మనస్సులో నుండే విజయభేరి వినిపిస్తుంది.
మీకు నచ్చిన పని తీరు బాగానే చేస్తారు.
కాని ప్రతి పని మీకు నచ్చేట్లు చేయడమే విజయరపహస్యం.
మీకు నచ్చనివి - మీకు చిన్న చిన్న పనులుగా అన్పించినవి మీరు అరకొరగా
చేసారంటే - అవి మీ విజయం పై ప్రభావం చూపిస్తాయి.
ప్రతి చిన్న పని శ్రద్ధగా - మీకు సంతృప్తి: కలిగేట్లు చేస్తే". విజయం మీకు దగ్గరవుతుంది
జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుగుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
'ప్రతివారు తమ జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఏర్పరచుకోవాలి అది చాలా వున్నతంగా వుండాలి.
ఉన్నత లక్ష్యం ఏర్పరచుకోవడం సాధ్యం కాకుంటే దాని గురించే ఆలోచించండి .
చేతిలో ఉన్న పని శద్ధగా చేయడం ఎప్పుడూ మరవకండి అభిరుచులు ఆలోచనలు
కలల నుండి వస్తుంది. వాటిని నిశితంగా పరిశీలించండి
లక్ష్యం అంటూ ఏర్పరచుకుంటే
దాన్నిసాధించడం సులభం అవుతుందని గ్రహించండి.
Comments
Post a Comment