పదిమందిలో ప్రశంసించండి.అద్భుతాలు జరుగుతాయి.
🤝పిల్లలు మెరుగువ్వాలంటే , పిల్లల్లోని సుగుణాన్ని ఇతరులకి చెప్పేటప్పుడు వారికి వినపడేటట్లు చెప్పడమే
🍀మీరు ఇప్పటికే పిల్లలను ప్రశంసించే అలవాటు ఉంటే ,అది పిల్లలు ఎమోషనల్ గా ,ఆరోగ్యంగా పెరగడానికి గొప్ప పునాది . ఒకవేళ లేకపోయినా మొదలు పెట్టడానికి ఇప్పటికి ఆలస్యం కాదు .
🌸ప్రశంస ఆత్మ ఔన్నత్యం ,విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహద పడుతుంది .పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పొగడని క్షణమంటూ ఉండదు. అంత ముద్దు చేసేవారు ,పిల్లలు పెరిగేకొద్దీ నిబంధనలు, విమర్శలు ,హితబోదలు పెరిగి ప్రశంసించడం ,ప్రోత్సహించడం తగ్గుతున్నాయి .పదిమందిలో ప్రశంసించాలి .ఒంటరిగా ఉన్నప్పుడు వివరించాలి .
🤝చేతలతో ప్రశంసించండి : అన్ని సార్లు మాటలే కాకుండా చేతలతో (గిఫ్ట్స్)ప్రశంసించండి .
🍁ఉదాహరణ:తన గది శుభ్రం చేసుకున్నప్పుడో, తల్లికి సహాయం చేసినప్పుడో ,దీనిలో అయినా ప్రతిభ కనపరిచినప్పుడో ,కేవలం అభినందనలే కాక, వారికి అత్యంత ఇష్టమైన సర్ప్రైజ్ గిఫ్టులు ఇవ్వడం ఒక అద్భుతమైన ప్రశంస గా స్మృతిపథంలో మిగిలిపోతుంది .
కాక పోతే చెప్పడం కన్నా చేయడం ముఖ్యం .ఆటగాళ్లు పతకం కొట్టగానే ప్రకటించిన బహుమతి ఇవ్వలేదని పత్రికల కెక్కే పరిస్తితిలా కాకుండా ,చేయాలనుకున్నది వెంటనే చేయడమే ఉత్తమం .
🌷మరోసారి గుర్తుంచుకోండి ,గుర్తించబడిన బహుమతి ఇవ్వబడిన ఏ ప్రవర్తన అయినా తిరిగి పునరావృతం అవుతుంది .
🎯 Any behaviour that gets Recognined or rewarded gets repeated
ఇలా ప్రశంసించవచ్చు
🍀చాలా బాగా చేసావు
🌹నీలో టేలెంట్ పుష్కలంగా ఉంది.
🍁నీకా ఆలోచన రావడం అభినందనీయం
🌸
ఇంత నీట్ గా ఎవరు చేశారు !గ్రేట్
🌻ఈ చిత్రం నువ్వే గీసావా ?ఎంత అందంగా ఉంది
🌺నీలో ఆ సత్తా ఉంది
🍇నీ ఓపిక, సహనం నాకెంతో నచ్చింది
🌷నిన్ను చూసి గర్వపడు తున్నాను
🏵నీకు ఇంత మంచి మనసున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది
🍀నీవు ఈ రంగంలో సూపర్ స్టార్ అవుతావు
🍁ఎక్కడ నేర్చుకున్నావు ఇంత నైపుణ్యాన్ని ?
🌷నీవు చేస్తున్న పద్దతి చాలా బాగుంది
🌹ఇది అద్భుతం గా ఉంది
🌸నీవు ఒక అరుదైన వ్యక్తివి
🍀నిన్ను చూస్తూవుంటే చాలా గర్వంగా ఉంది
🍁నీ నుంచి నేను కూడా ఇవాళ నేర్చుకున్నాను
🌹నీవు తమ్ముడు పట్ల ఎంతో బాధ్యతగా వున్నావు
🌻చాలా బాగా ఆలోచించావ్
🌺ఈ ఐడియా చాలా బాగుంది
🌸నువ్వు చాలా శ్రద్దగా వున్నావు
🏵ఈ రోజు నీలో మంచి మార్పు చూసాను
🍀చాలా కష్టపడ్డావు /ఆట బాగా ఆడావు/నీ బెస్ట్ నీవు చేసావు
🌷నీవు అడిగే తీరు చాలా ఆలోచనాత్మకం గా ఉంది
ఇలా ప్రశంసించడానికి వంద అవకాశాలు ఉంటాయి .
ఒక వేళ విమర్శించాలంటే అది కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి . ప్రశంసకు ప్రశంసకు మధ్య మెరుగవ్వడానికి సూచన చేయాలి .🌻
విలియం జేమ్స్ఏమన్నాడంటే
" లోతైన మానవ అవసరం ఏమిటంటే ,అభినందించబడాలన్న " అవసరం.
Comments
Post a Comment