కొత్త గా ఇంటికితెచ్చిన కోడిని ఇంటి ఆవరణకు అలవాటు చేయడానికి, ఒక వారం రోజుల పాటు, ఒక గుంజెకు తాడుతో కట్టేస్తారు, తర్వాత దాన్ని విడిచిపెట్టినా ఊరు మొత్తం తిరిగి తిరిగి చీకటి పడే ముందు అదే ఇంటికి వచ్చి గంప చుట్టూ తిరుగుతది కానీ పారిపోదు ఎందుకంటే దాన్ని అలా conditioning చేశారు.
ఎంత అంటే పంజరంలో ఉన్న చిలుక ఎగురుతున్న పక్షుల్ని చూసి వాటికి ఏదో రోగం వచ్చింది కావొచ్చు అనుకునే అంత conditioning చేస్తారు.
Ex:- సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు బాగా ఫాలో అయ్యే ఒక మహిళ, ఎవరైనా న్యూ జనరేషన్ అమ్మాయి ఇలాంటివి ఫాలో అవ్వకుండా తనకు నచ్చినట్టు తాను బ్రతికితే బరితెగించి బ్రతుకుతుంది అంటారు, కానీ వారు మాత్రం అందమైన పంజరంలో జీవిత ఖైదు అయ్యాము అని మాత్రం ఒప్పుకోరు..
అదే విధంగా Western countries లో, కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్కను కొన్ని రోజుల పాటు ఇంటి ఆవరణలో ఒక fence వేసి పెడతారు, తర్వాత ఆ కుక్క ఆ (fence) కంచె దాటి వెళ్లే ప్రయత్నం life లో చేయదు, దీనినే habitual conditioning అంటారు. అలాగే ఒక ఏనుగు కావొచ్చు, ఎద్దు కావొచ్చు, గుర్రం కావొచ్చు ఒక చిన్న తాడుతో కట్టిపడేస్తే అక్కడే పడి ఉంటాయి, కానీ సంకెళ్ళు తెంచుకుని ముందుకు వెళ్లలేవు దీనినే psychological conditioning అంటారు.
ఇలా మనుషులు కూడా పుట్టి పెరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ అన్ని ఆచార వ్యవహారాల్లో conditioning చేయబడుతారు,
Ex:- ఒక మతం కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన మతమే గొప్ప, తన దేవుడు మాత్రమే గొప్ప అనుకుంటాడు, అదే విధంగా ఇతర మతాల్లో పుట్టిన వాడు తన దేవుడే గొప్ప తన మతమే గ్రేట్ అనుకుంటాడు. ఇలా వారిని వారి చుట్టూ పక్కల ఉన్న సమాజం, కుటుంబం, ఆచారాలు అన్ని conditioning చేస్తుంటాయి, at the end of the day మూర్ఖపు శికామణులుగా తయారు అవుతారు.
Ex:- ఒకడు హీరో ఫ్యాన్ అనుకుందాం. అసలు వాడు వీళ్లకు ఎందుకు ఫ్యాన్ అనే విషయం వాడికి కూడా తెలీదు కానీ చుట్టు పక్కన ఉన్నవారిని చూసి అనుకరిస్తాడు అంతే, లేకపోతే వాడు తేడా అవుతాడు కనుక, వీడు లైఫ్ లో ఎప్పుడు కూడా వాడు అభిమానించే హీరో గురించి తప్పుగా ఆలోచించడు, ఎవరైనా తప్పుని తప్పు అని point out చేసి చూపిస్తే, వాళ్ల మీద ఎటాక్ చేస్తారు, వీరి మెదడు ఎంత భయంకరంగా conditioning అవుతుందంటే వాడి మతమే గొప్ప, వాడి సంప్రదయమే గొప్ప, వాడి హీరోనే గొప్ప, వాడి కులమే గొప్ప, వాడి ప్రాంతమే గొప్ప ఇలాంటి arrogant mindset develop అవుతుంది. చివరకు వాడు నిజం ఏంటో అబద్ధం ఏంటో గ్రహించకుండా బావిలో కప్పలుగా తాను అనుకున్నదే కరెక్ట్ అనే భావనలో బ్రతికి చివరికి ఒక మూర్కుడిలాగా చనిపోతాడు, ఇలాంటి వారు బాగా ముదిరిపోతే మత ఛాందస వాదులుగా తయారు అవుతారు...!!!
Every child is a born atheist, freethinker and freebird but later on they become fundamentalists, casteist, arrogant hero worshippers when they grow up.
బాల్యంలో పిల్లల్లో ఉన్న questioning పెరిగి పెద్ద అవుతుంటే ఉండకపోడానికి కారణం, అతని మెదడు మొత్తం తరతరాల చెత్తతో మురుకి పట్టిపోతుంది (conditioning వల్ల) కాబట్టి వాడు నమ్మిన దేవుడ్ని కానీ, వాడు అభిమానించే హీరోని కానీ వాడి మతాన్ని కానీ ఎవరైనా కొంచెం విమర్శించిన తట్టుకోలేడు. వాడు బాల్యం నుంచి నమ్మింది తప్పు అని తెలిస్తే వాడి ego దెబ్బ తిని దాడులు చేస్తారు. ఇలా conditioning చేయబడిన మనుషులు జీవితం మొత్తం ఏదో ఒక *ism* ని మోస్తూ ఉంటారు.
Comments
Post a Comment