అరవై సంవత్సరాల క్రితమే రాబోయే కాలంలో కంప్యూటర్ ఉపయోగం
మనిషి మనుగడను శాసించే మహోపకరణంగా మారనున్నదని అంచనా వేశాడాయన. 'ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్'(కృత్రిమ మేధ), 'రోబటిక్స్' (మరమానవ శాస్త్రము) మరియు 'మనిషి-కంప్యూటర్ సంబంధ రంగాల్లోకి దృష్టి సారించి, ఆ దిశలో సకల శక్తులనూ
సమాయత్తం చేసుకున్నాడతను. ఎవరో కాదు అత్యున్నత శిఖరాలవైపు ప్రయాణం ప్రారంభించి.. ఒక్కో మెట్టు,
ఒక్కో అడుగుగా ఉన్నతస్థాయికి చేరిన నిశ్శబ్ద తపస్వి దబ్బల రాజగోపాల్ రెడ్డి అనబడే
'రాజి రెడ్డే ఆయన.ఆయన వయసిప్పుడు డెబ్బయ్యయిదు సంవత్సరాలు.. అలసట ఎరుగని నిత్య అధ్యయనం ఒక తీరని దాహమై మనిషిని ఎలా జ్ఞానవంతుణ్ణి చేస్తుందో అతని
జీవనరేఖ చెబుతుంది.మనిషి తనకు ఆసక్తికరమైన రంగాన్ని తన అభిరుచికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోగల్గడం ఒక గొప్ప ప్రజ్ఞ.. యిక్కడ ప్రశ్నేమిటంటే.. మనకు ఏ అవకాశమొస్తే ఆ అవకాశాన్ని అసరాగా చేసుకుని ఎదుగుదామా, లేక మనం ఎదుగదల్చుకున్న దిశలోనే
అవకాశాలను సృష్టించుకుందామా.. అని. చాలామంది అవకాశాలను సృష్టించుకోరు.
వచ్చిన అవకాశాలనే ఉపయోగించుకుంటారు. కాని అతికొద్దిమంది దీక్షాపరులు మాత్రం
తన జీవనదిశను ముందే నిర్వచించుకుని, నిర్ధారించుకుని కేవలం ఆ గమ్యాన్ని
ఆ తలెత్తుకుని నిలబడగలిగినప్పుడు ఎవరైనా పొందే మహోద్విగ్న ఆనందాన్ని ఏ భాషా వ్యక్తీకరించలేదు. అది కేవలం అనుభవైకవేద్యమే. రాజిరెడ్డికి ఆ ఆనందానుభూతి తెలుసు.
రాజిరెడ్డి విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి
చెందిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండీ (ఇప్పుడు అన్నా విశ్వవిద్యాలయంలో
విలీనమైంది) నుండి 1958లో సివిల్ ఇంజినీరింగ్ లో బి.ఇ. చేశారు. తర్వాత
ఆస్ట్రేలియాకు వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ నుండి 1960లో ఎమ్.టెక్
పట్టా సంపాదించారు. తదనంతరం అమెరికా చేరి 1988లో ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్
విశ్వవిద్యాలయం నుండి కుప్యూటర్ సైన్స్ లో పి.హెచ్.డి. డిగ్రీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'
రంగ మూలపురుషుల్లో ఒకరైన జాన్ మెక్ కార్తీ వేతృత్వంలో సాధించి యిక రెక్కలను
విప్పారు. ఆకాశమే హద్దు. ఇక సువిశాల అధ్యయన సముద్రమే అవధి.ఇక ప్రయాణం
మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ లోని కాటూరులో 13 జూన్ 1931న జన్మించిన రాజిరెడ్డి 1960 నుండి 63 వరకు ఆయన ఐ.బి.యం.కు అప్లయిడ్ సైన్స్ ప్రతినిధిగా ఆస్ట్రేలియాలో పనిచేశారు. 1966 నుండి 69 వరకు స్టాన్ఫోర్డ్ యూనివర్సెటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విద్యాబోధన గావించారు.
96లో ప్రతిష్టాత్మక కార్నిగ్ మెల్లన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరి 1979 నుండి
1991 వరకు రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ కు వ్యవస్థాపక డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే
విశిష్టమైన లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ఇనిస్టిట్యూట్ లను సృష్టించడంలో గురుతర బాధ్యతలను నిర్వహించారు. ఇవిగాక సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ, ఇన్స్టిట్యూట్ ఫర్ సాఫ్ట్ వేర్ రీసర్చ్" వంటి అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించిన సంస్థలకు రూపకల్పన చేశారు.
రాజిరెడ్డి గారి పరిశోధనలు ప్రధానంగా కృత్రిమ మేధకు సంబంధించినవి. చూస్తూ
వింటూ, మాట్లాడూ, నడిచే కంప్యూటర్ల సృష్టి (రోబో)లో చాలా ప్రయోగాలు జరిగి వాటిని తయారు చేస్తున్నారు.
రాజిరెడ్డిగారి ప్రతిభను ప్రాతిపదికగా పరిగణించి అతన్ని వరించిన పదవులు, గౌరవాలు ఎన్నో. అమెరికా దేశపు ప్రతిష్టాత్మక సంస్థలైన ఇనిస్టిట్యూట్ ఆఫ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్', 'అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్టిఫీషియల్
ఇంటలిజెన్స్ లో ఆయన ఫెల్లో, "నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్' లో ఎన్నుకోబడ్డ
సభ్యులు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మిట్టరాండ్ చేత ప్రతిష్టాత్మక లిజియన్ పురస్కారం పొందారు.
1987 నుండి 1989 దాకా ఎఎఎఐకి అధ్యక్షులు. మైక్రోసాఫ్ట్ సలహామండలిలో సాంకేతిక సలహాదారు. 1991లో ఐబియం యొక్క పరిశోధక రాల్ఫ్ ఇ గోమర్ విజిటింగ్ స్కాలర్పురస్కార గ్రహీత కాగా 1999 నుండి 2001వరకు అమెరికా అధ్యక్షులు క్లింటన్
మరియు బుష్ కు 'ప్రెసిడెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్ వైజరీ కమిటీ'కి సహాధ్యక్షులు,
ఆయన 1994లో 'కృత్రిమ మేధ' రంగంలో అత్యున్నతమైందిగా భావింపబడే 'ట్యూరింగ్
అవార్డును సొంతం చేసుకున్నారు. కాగా అతనికి మన శ్రీవేంకటేశ్వర విద్యాలయం
నుండి మొదలుకుని హెన్రీ పెన్ కేర్ యూనివర్సిటీ, ఫ్రాన్స్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్
వేల్స్, ఆస్ట్రేలియా, జెఎన్‌టియు, ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుట్స్ యుఎస్,
యూనివర్సిటీ ఆఫ్ దార్విక్, ఇంగ్లండ్ అన్నా యూనివర్సిటీ, చెన్నై, ఐఐటి, అహమ్మదాబాద్
వంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలను ప్రధానం చేశాయి. అతని
విలువైన శాస్త్ర సాంకేతిక రంగాల్లో అందజేసిన సేవలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి
కె.ఆర్. నారాయణన్ 1991లో 'పద్మభూషణ్' పురస్కారాన్ని అందజేశారు. 2004లో
బకారా ప్రైజ్, 2005లో హోండా, జపాన్ పురస్కారం, 2006లో వన్నీవర్ బుష్ అవార్డ్...
వంటివి ఇంకెన్నో.
ప్రస్తుతం పిట్స్బర్గ్ లో నివసిస్తున్న రాజిరెడ్డిగారు నడక, పఠనం తన
ప్రాణప్రదమైన అభిరుచులుగా ప్రస్తుతిస్తారు. ఇద్దరు అమెరికాలోనే నివసించే కూతుళ్ళకు
తండ్రియైన రాజిరెడ్డిగారికి అమెరికాలో 'రోబొటిక్స్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్' రంగ నిపుణుడిగా లభించే గౌరవం అపారం. అది ఆయన కష్టపడి ఒక జీవితకాలంలో సంపాదించుకున్న జ్ఞానసంపద.
ప్రతి సంవత్సరం అమెరికా రోడ్ ప్రమాదాల్లో సంభవిస్తున్న నష్టం దాదాపు 56 బిలియన్ డాలర్లు. ఎన్నో ప్రాణనష్టాలు. ప్రతి సంవత్సరం కనీసం 20 నుండి 30వేల మంది ప్రాణాలను రక్షించగల్గడాన్ని సాధ్యపరిచే ఏ సాంకేతిక సృజననైనా నేను హర్షిస్తా అంటారు రాజిరెడ్డి. అంతిమంగా ఏ వృత్తి నిపుణుని లక్ష్యమైనా మానవా సౌభాగ్య కాంక్షే ఐనపుడు అంతకంటే సార్థకత ఏముంటుంది.
మనిషి సంఘజీవి అన్న పరమసత్యాన్ని విస్మరించనంతకాలం సర్వేజనా సుఖినోభవంతు.
Comments
Post a Comment