మన నమ్మకమే మన సామర్థ్యం
Capacity=belief
నమ్మకం మనిషి నింగికి ఎగిసేటట్లు చేస్తుంది లేదా నేలకు పడేటట్టు చేస్తుంది
వేయి దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవని వివేకానందుడన్నాడు.
నిన్ను నమ్మితే నీ శక్తులన్నీ నీ ఎంపికలోనే ఏకీకృతం చేస్తాయి. నీ ఎంపికల వెనుక నువ్వు నిలబడిననాడు నీ విజయ అవకాశాలు ఒకటికి పదింతలవుతాయి
___చెర్రీ కార్టర్ స్కాట్
నేను చేయగలను అని దృఢంగా అనుకున్నప్పుడు నీ మెదడు దాన్ని ఎలా సాధించాలో ఆలోచిస్తుంది
నిజజీవితంలో ప్రతి పెద్ద వ్యాపారము నమ్మకం అనే మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది.
పెరుగుదల అనేది పిరమిడ్ లాంటిదని దాని మీద ఉండటానికి చోటు ఉండదని నమ్మితే మనిషి పైకి ఎదగలేడు.
నమ్మకం ఉన్నవాడు బలవంతుడు.
అనుమానం ఉన్నవాడు బలహీనుడు.
బలమైన గట్టి నమ్మకాలు ఉంటాయి గొప్ప గొప్ప గొప్ప పనుల వెనక
_____జె ఎఫ్ క్లర్క్
కలలను నమ్మితే మన అంతరంగం ఖచ్చితంగా ఆ కల పట్ల కమిట్మెంట్ ఏర్పరచుకుంటుంది.
తమ కలల గొప్పతనాన్ని గ్రహించి వాటిని నమ్మ కలిగిన వ్యక్తులకు స్వాగతం పలుకుతుంది ప్రపంచం
_____గోథే
దేన్నయితే నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావో దానిని సాధించి తీరుతావు.
నమ్మకం అనే విశ్వాసాన్ని మించిన శక్తి ఏదీ లేదు.
భవిష్యత్తు మనదే అన్న నమ్మకంతో జీవించాలి.
Comments
Post a Comment