శ్రద్ధవాన్ లభతే జ్ఞానం,
తత్వరస్సం యత్యేంద్రియః
జ్ఞానం లచ్వా పరాం శాంతిం
అచిరే నాధిగచ్చతి!
_ (భగవద్గీత)
శ్రద్ధ కలవానికే జ్ఞానం లభిస్తుంది. మనసు కు ఒక స్థిరత్వం కలిగితే కానీ తన గురించి తనకు అర్థం కాదు.జ్ఞానోదయమైతే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
శ్రద్ద పెట్టి పని చేస్తే పని జరుగుతుంది.
ఫలితం సరిగా లేదంటే మన శ్రద్ద తక్కువైందని అర్థం .దీన్ని ఆత్మ విమర్శ చేసుకోవాలి.లేదంటే
మనసు కుదుట పడదు.
ఉద్ధరేదాత్మనాత్మానం,
నాత్మాన మవ సాదయేత్ !
ఆత్మైవ హ్యాత్మనో బద్దుః
ఆ త్మైవ రిపురాత్మనః!
ప్రతి వ్యక్తి తనను తానే ఉద్దరించుకోవాలి. కానీ అధోగతి పాలు కాకూడదు. ఎవనికి
వాడే బంధువు. తనకు తానే శతృవు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడరాదు. స్వయం శక్తే ప్రధానం. తన విజయానికైనా పరాజయానికైనా తనే బాధ్యుడు. విఫలమైన ప్పుడు ఇతరులు కారణమని చెప్పరాదు. ప్రభుత్వం
సహాయం చేయటం లేదని, టీచర్లు సరిగా చెప్పటం లేదని, తల్లిదండ్రులు సరైన మార్గదర్శనం చేయటం లేదని కుంటి సాకులు
చెపుతారు కొందరు. ఇదెంత మాత్రం సరైంది కాదని చెపుతుందా శ్లోకం.
యుక్తాహార విహారస్య
యుక్త చేతస్య కర్మను
యుక్తస్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖహాః
తిండిపోతుకు యోగ చేయటం సాధ్యం కాదు. మరీ ఉపవాసాలు చేసేవారికి యోగ
కుదరదు. ఎక్కువ నిద్రించేవాడికి, నిద్రమాని జాగరణ చేసేవాడికి కూడా యోగసాధన వీలుకాదు. అన్నింటిలో మితాన్ని పాటించేవాడికే యోగ సిద్ధిస్తుంది. ఇక్కడ యోగ బదులు లక్ష్యం అని పెట్టుకున్నా, విద్య అని పెట్టుకున్నా అర్థం ఒకటే.మితంగా వుండి సాధన చేస్తే ఏదైనా సాధ్యమే నని అర్థమవుతుంది.
Comments
Post a Comment