ఏదైనా వస్తువునో స్థలాన్ని చూడాలనుకోవడం, ఏదైనా విషయం గురించి చదవాలనో వినాలనో అనుకోవడం, అందుకు తాపత్రయ పడటం, ఆసక్తి చూపడం కుతూహలమనిపించుకుంటుంది. ప్రతి మనిషికీ ఈ కుతూహలం ఉంటుంది అదొక ఆశగానో, కోరికగానో పరివర్తన చెంది, సాధించేందుకు ప్రేరేపిస్తుంది.
మంచి కోసమైతే ఏ కుతూహలాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు. అదే. చెడుమార్గాన నడిపితే ఆ కుతూహలం అత్యంత ప్రమాదకరమైంది. అంతా తనకు తెలుసుననే ఆహుకారం మనసులో అంకురించిందంటే, మనిషి పతానావస్థకు పునాది పడినట్లే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాది పవిత్ర గ్రంథాల్లో అపారమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంది మానవ మనోవికాసానికి తమను స్వీకరించమని, జీవితం సార్ధకం చేసుకొమ్మని ఆ జ్ఞానభాండాగారం పిలుస్తోంది, కాని, మనిషిని ఈ తిళ్లు, ఒత్తిళ్లు అటువైపు పోనీయడం లేదు పసిబాలుడి కుతూహలం చూడండి. నేలపై ప్ారాజేవాడు నిలబడటానికి, నిలబడ్డవాడు నడవడానికి నడిచేవాడు పరుగెత్తడానికి కుతూహలపడతాడు. అంతవరకూ వాడిలో దైవత్వమే ఉందనుకోవాలి. వయసు పెరిగిన కొద్దీ ప్రలోభాల వైపు భోగాలవైపు కుతూహలం పెరిగి, ఇంక మొదలవుతుంది అమానుషత్వం కుతూహలం మంచి విషయాలవైపు పోనిచ్చుకునేవాడు అభ్యున్నతి పొందుతాడు. మూలాలు తెలుసుకొని మానవీయ మెచుకోగలుగుతాడు విలువల్ని
జీవితంలో అంతా మనమనుకున్నట్లు జరగదు. అలా జరిగితే అది జీవితం ఎలా అనిపించుకుంటుంది ఆనుకోని అవరోధాలు అవాంతరాలు వచ్చి పడుతుంటాయి ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించాలి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత ఆనుకొనేవాడు. ఎంతో కుతూహలంతో సర్వదా జ్ఞానప్రాప్తి కోసం తపిస్తూనే ఉంటాడు. ఆ తపస్సే అతడికి ఉషస్సు చూపిస్తుంది. యశస్సు చేకూరుస్తుంది.
మనకిదే రాసి పెట్టి ఉంది. ఇది మన ప్రారబ్ధం' అనుకునేవాడేమీ సాధించలేడు. కుతూహలంతో వేసే ప్రతి అడుగూ అద్భుతాలను, ఆశ్చర్యాన్ని అందిస్తూ మంచి ప్రేరణ కలిగిస్తుంది. విషయం. మీద ఆసక్తిని పెంచుతుంది ఏకాగ్రతను వృద్ధి చేస్తుంది. లక్ష్యానికి చేరుస్తుంది . మనిషి వెతుకుతూ బతకాలి. మెతుకు కోసం కాదు, మంచికోసం వెతకాలి
కుతూహలంతో, ఆసక్తితో, పట్టుదలతో వెతకాలి. నిరంతరాన్వేషణ అనంత విజ్ఞానం ప్రసాదిస్తుంది. తీసుకునేవాడిగా మిగలకూడదు. ఇచ్చేవాడిలా ఉండాలి • విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులో కలిగే కుతూహలం మీదనే ఆధారపడి ఉంది. కుతూహలం వల్లనే ప్రశ్నించే మంచి లక్షణం విద్యార్థిలో కనిపిస్తుంది. దానివల్లనే జ్ఞాన తేజస్సు ఆవిర్భవిస్తుంది
మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనకా ఓ అవకాశం దాగి ఉంటుంది అది తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే చాలు, ఉన్నదాంతో సంతృప్తి చెందడం మంచిదే కాని- జ్ఞానప్రాప్తి విషయంలో మాత్రం తపన ఎంతైనా అవసరం. ఇష్టంగా చేసే పనికి సమయం లేకపోవడమంటూ ఉండదు. కావలసింది దృడసంకల్పం. ఏకాగ్రత, ఆలోచనల వల్ల ఆ నైపుణ్యం సిద్ధిస్తుంది. ఒకదారి మూసుకుపోయినప్పుడు జీవితంలో మరోదారి తెరచుకొంటుంది. ఉత్సుకతతో దాన్ని గుర్తించగలగడమే విజయసూచకం విజయసాధనకు మూలమైన ఆత్మ విశ్వాసం, కృషి కుతూహలం వల్లనే లభ్యమవుతాయి.. ఈ ప్రవృత్తి ప్రతి మనిషికీ అవసరం.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
epaper.eenadu.net
Comments
Post a Comment