ఎదురీదే చేతులుంటే ఏరు దారి ఇవ్వక ఏం చేస్తుంది?
పయనించే అడుగులు ఉంటే బాట ఏం చేస్తుంది?
పిడికిలి పిండే మనిషికి ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది?
మన లోకం మనదంటూ ఒదిగుంటే
ఎవరికి వారే
జగమంతా మనవారే అనుకుంటే
పరులే లేరే
అనువనువు మన ప్రాణం అందరికోసం నలుగురిలో చూడాలి మన సంతోషం
ఆరాటం ముందు ఆటంకం ఎంత?
సంకల్పం ముందు వైకల్యం ఎంత ?
దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత?
ఎదురీత ముందు విధిరాత ఎంత?
నమ్మకం పట్టుదల నీ రెండు రెక్కలు గా
ఎగెరేయ్ ఏలేయ్
నీ ఆశల ఆకాశాన్నంతా
అస్తమిస్తున్న సూర్యుడు అన్నాడు నా పని ఇంకెవరు చేస్తారని
నాకు ఆ పని వదలండి ప్రభు అన్నది
ఆత్మవిశ్వాసం నిండిన ప్రమిద
చినుకు చినుకు కలిస్తే అవుతుంది నది
పైసా పైసా జమ చేస్తే అవుతుంది నీది
మనిషి మనిషి కలిసి పనిచేస్తే అవుతుంది జయం మనది.
అనగనగా రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ
Comments
Post a Comment