1) పరిస్థితులు వాటంతట అవేమారవు. మనం మార్చాలి.__ థోరో
2) భవిష్యత్తును ఖచ్చితంగా అంచనావేయాలంటే వర్తమానాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
3) ఏ సంస్థ అయినా భవిష్యత్తులో కూడా మనగడ సాగించాలంటే పరిస్థితులకనుగుణంగా మార్పుచెందే లక్షణాన్ని బట్టి వుంటుందిగాని భవిష్యవాణిని బట్టిగాదు.
4) నిన్నటి ఆలోచనలతో నేటి వ్యాపారం చేస్తే, రేపటికి వ్యాపారంలో మనం వుండం.
5) నావికునికి తన గమ్యానికి మార్గం సరిగ్గా తెలీకపోతే ఎలాంటి పవనాలూ ఉపయోగకరంగా వుండవు.
6) వినియోగదారుడు నవ్వితే సంస్థ అభివృద్ధి చెందుతుంది. వినియోగదారుడు ఆగ్రహిస్తే ఆ సంస్థ మునుగుతుంది.
7) మన చుట్టూ మనమే వూహల సాలెగూళ్ళు అల్లుకొని అందులో చిక్కుకుపోతాం.
8) ప్రజలను ద్వేషించటం అంటే చిట్టెలుక కోసం ఇంటిని తగులబెట్టుకున్నట్లు హెచ్.ఈ. ఫోర్స్ డెక్
9) అడవిలో రెండు గమ్యాలు ఎదురైతే ఎవరూనడవని దారినే నేనెన్నుకుంటాను.
అదే అంతిమ విజయానికి సోపానమనుకుంటాను. _రాబర్ట్ ఫ్రాస్ట్
10) తన అదృష్ట సౌదానికి తానే కర్త (డేల్ కార్నెగీ )
11) ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్మితే, అది నీ జీవితంలోకి రాకమానదు. (చార్లెస్ పెడ్డాక్)
12) ఫలితాలు రాని పని ఉంటుందిగాని, పని లేకుండా ఫలితాలు ఉండవు.
13) విజయ శిఖరాలు చేరిన మహాత్ములు అకస్మాత్తుగా, ఆయత్నంగా అక్కడకు చేరలేదు. తన తోటివారు సుఖనిద్రలో ఉన్నపుడు, వీరు రాత్రిళ్లు కూడా శ్రమించారు. (హెచ్.డబ్లు. లాంగ్ఫైలో)
14) తెలివైన వారు ఏది అవసరమో దాన్నే చేస్తారు. టాలెంట్ ఉన్న వారు వారి శక్తి కొలదీ చేస్తారు. (ఇ. బిల్వర్ లిట్టన్).
15) ఎదుటివార్ని నీవైపుకు ఆకర్షించడానికి చేసే ప్రయత్నం కన్నా ఎదుటి వారివైపు శ్రద్ధ చూపే ప్రయత్నం వల్ల ఎక్కువ మంది మిత్రుల్ని సంపాదించుకోవచ్చు. (డేల్ కార్నెగీ).
16) ఒక ద్వారం మూసుకుంటే ఇంకో ద్వారం తెరవబడి ఉంటుంది. కానీ మనం మూసి ఉన్న ద్వారం వైపే ఎక్కువసేపు చూడడం వల్ల, తెరచి ఉన్న ద్వారాన్ని మనం గమనించం(హెలెన్ కెల్లర్)
17) ప్రయాణం కష్టంగా ఉంటే, శక్తిమంతులు ఇంకా శక్తిమంతులై ప్రయత్నాన్ని కొనసాగిస్తారు.
18) ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఓ పర్వతాన్ని కదిలించవచ్చు..
19) పైసాలేనివాడు పేదవాడు కాదు. కల లేనివాడే పేదవాడు. (హ్యారీకెంప్)
20) నీ స్వప్నం గూర్చి అందర్నీ ఒప్పించాలనుకోవద్దు. దాన్ని ఒప్పుకొనేవారు తక్కువమంది మాత్రమే. (బిల్ కాన్ బీ).
21) కోడిపిల్లలతో పెరిగిన గడ్డపిల్ల కోడి అవుతుంది తప్ప ఎగరడము నేర్చుకోదు.
22) నీక్కావాల్సింది నీ మనసులో చిత్రీకరించుకుంటే నువ్వు సాధించుకోగలవ్. నువ్వు స్వప్నిస్తే అది జరగక మానదు. (అర్థర్వార్డు)
23) అభివృద్ధికి మూలం మనిషి ఎంపిక చేసుకోవడంలోనే ఉంది. (జార్జ్ ఇలియట్)
24) ఏదీ యాదృచ్ఛికం కాదు. ప్రతిదానికి కారణం ఉంటుంది. (వాల్టేర్)
25) నిరంతర విజయం ప్రపంచానికి ఒక వైపును మాత్రమే చూపిస్తుంది. ప్రతికూలత పూర్తి
నిజాల్ని తెలియజేస్తుంది. (కోల్టన్)
26) ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే అది విజయమే అవుతుంది. (మాల్కోమ్ ఫోర్బ్స్)
27) భగవంతుడు మనల్ని ప్రయత్నం చెయ్యమంటున్నాడే కాని, విజయమే ముఖ్యమని చెప్పలేదు. (మదర్ థెరీసా)
28) పట్టుదల అడ్డంకుల్ని జయిస్తుంది(అయాన్ సేమూర్)
29) సూర్మమండలంలో కొంచెం చోటు కావాలంటే కొన్ని బొబ్బలు తప్పవు. (డీన్ అబ్బీ)
30) జీవిత ప్రారంభంలోనే కొన్ని వైఫల్యాలను పొందితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
__ (టి.హెచ్. హక్సీ)
31) బుద్ధితెరచి ఉంటే, సంపద సమకూరుతుంది. నాటడంలో ఉన్న సంతోషం కోయడంలో లేదు. (సింటో బెనెవాన్టే)
32) వయస్సుకంటే ఎక్కువ శక్తిని ఇచ్చేది దృక్పథమే. (రాబర్ట్ ఘల్గర్)
33) జరుగుతున్న సంఘటనల కంటే వాటిపై ఏర్పరచుకొన్న అభిప్రాయాలు మనిషికి వినాశనాన్ని కల్గిస్తాయి. (సెనేకా)
34) పని చేతనైనవారు చేసి చూపిస్తారు. చేతకానివారు బోధిస్తారు. బెర్నార్డ షా
35) వైఫల్యం పెట్టుబడి తక్కువ కావడంవల్ల కాదు. ఉత్సాహం తక్కువ కావడం వల్లనే అవుతుంది.
___డేనియల్ వెబస్టర్
36) సంపద పోతే ఏమీ పోనట్టే. ఆరోగ్యం పోతే కొంతపోయినట్టు, సౌశీల్యం పోతే అంతా పోయినట్టే. (బిల్లీగ్రాహం)
37) తమ గొప్పలు చెప్పుకొనేవారికి వాటిమీద తమకే నమ్మకం ఉండదు. (పాల్ హన్నా)
38) ఒకరు జాలరి, ఇంకొకరు పడవల నిపుణుడు. ఇద్దరు కలిసి పనిచేస్తే, ఒక్కొక్కరు విడివిడిగా పట్టిన మొత్తం చేపలకన్నా, కలిసి పట్టిన చేపలు రెండు రెట్లు ఎక్కువ ఉంటాయి. (ఫ్రేమ్ టిబోల్ట్)
39) కలుసుకుంటే ప్రారంభం.కలిసి ఉంటే అభివృద్ధి.కలిసి చేస్తే విజయం
___ ఫోర్డ్
40) పందితో ఎప్పుడూ కుస్తీ పట్టకూడదని తెలిసుకున్నాను. ఇద్దరూ బురదలో పార్లవలసివస్తుంది. అది పందికి ఇష్టమైనపని. (సైరన్ సింగ్)
41) జీవితం గురించి భయం వద్దు, జీవించడం ఎంతో ప్రయోజనకరం అని నమ్మండి. అదే నిజమవుతుంది. (విలియం జేమ్స్)
42) నీ నమ్మకాన్ని మార్చుకుంటే, నీవిధి మారుతుంది.
Comments
Post a Comment