పదితో పదండి ముందుకు
అతిగా ఆలోచనలు : ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో రకరకాల సమస్యలు.వాటిని అధిగమించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే ఆరోగ్యానికి చేటు. మాన సికంగా కుంగి కృశించిపోతాం. అతి ఆలోచనలు అనర్థం అంటారు మన స్తత్వ శాస్త్రవేత్తలు.
మాట సాయం ముఖ్యమే : మీ శ్రేయస్సు. అభివృద్ధిని కాంక్షించేవారు.. కొందరుంటారు. వారి సలహా తీసుకోండి మీ సమస్యను నిర్మొహ మాటంగా చర్చించండి. మనసులో ఉండే భయాలన్నింటిని వ్యక్తం చేయండి. పరిష్కారం కచ్చితంగా లభిస్తుంది. అంతేనా.. మీలో అప్పటి దాకా ఉన్న ఒత్తిడి చాలామటుకు దూరమై మనసుకు సాంత్వన లభి స్తుంది.
అడుగులు వేయండి: ఎంత మరచిపోదామన్నా కొన్నిసార్లు దిగులనేది ఓ అలవాటుగా మారిపోతుంది. నెమ్మదిగా దాన్నుంచి బయటపడే పరిష్కా రాలను వెతికేందుకు సిద్ధం కండి
కాసేపు మరో పనిచేయడం మొదలు పెడితే ధ్యాసమళ్లుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
నిర్ణయంగా నిర్ణయాలు:. "ఇలా చేస్తే ఏం జరుగుతుందో.. కొంతకాలం వేచిచూడనా..' వంటి వేధించే ప్రశ్నల వలలో పడకుండా వేగంగా సము చిత నిర్ణయాలు తీసుకోవాలి. పొరబాటు చేస్తున్నామని మనసుకు అనిపిం చినా ఆ కోణంలోనే ఆలోచిస్తూ ముందొక నిర్ణయానికిరండి
ప్రాధాన్యాలు చూడాలి: ఒకేసారి ఎన్నో పనులు, సమస్యల గురించి ఆలోచించడం మెదడుపై భారం. ఇలాంటప్పుడు ప్రాధాన్యతల్ని గుర్తించాలి. అతి ముఖ్యమైన పనులను మొదట పూర్తిచేయాలన్న నియమాన్ని ఆచర ణలో పెట్టండి.
వదిలేయండి: ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో జరిగే నష్టం జరగక మానదు. అలాంటప్పుడు. 'అయ్యో' అనుకుంటూ రాధ పడేకన్నా సమస్యను అంతటితో వదిలేయడం మేలు. అయితే, ఆ పొరబాటు మరోసారి ఎదురుకాకుండా చూసుకోవడం మీ బాధ్యత.
నిర్లక్ష్యం వద్దు: సమస్యలు ఎదురైనప్పుడు, వ్యక్తిగత జీవితాన్ని తెలియ కుండానే నిర్లక్ష్యం చేస్తాం. అదే పొరబాటు, ఆహారం తినడం నుంచి. హాయిగా నిద్రపోవడం దాకా అన్నీ వేళపట్టున జరిగిపోవాలి. ఆ తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచించాలి. సమయంలో వ్యాయామం. ధ్యానం వంటివి ఎంతో మేలు చేస్తాయి.
సానుకూల దృక్పథం: భయం, కోపం.. ఏదో కోల్పోయామనే భావనలు దూరం కావాలంటే సానుకూలంగా ఆలోచించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రతికూల ధోరణులకు తావివ్వకుండా, సానుకూలంగా ఉండేం దుకు ప్రయత్నించండి.
మనసుకు తాళం: అంటే.. మీరు ఆఫీసునుంచి ఇంటికొస్తారు. ఆ తర్వాత మీ ధ్యాసంతా ఇల్లు.. కుటుంబసభ్యుల చూట్టూనే ఉండాలి. అంతేకానీ మర్నాడు పూర్తిచేయాల్సిన ప్రాజెక్ట్కు సంబంధించి.. లేదా తోటి ఉద్యోగ స్తుల గురించే ఆలోచిస్తే ఎలా.. అందుకే గదులు మారినట్లుగా మనసుకు ఎప్పటికప్పుడు తాళం వేసి.. మరో తలుపును తెరవాలి, చాలామంది ప్రముఖుల జీవిత రహస్యం కూడా ఇదేనని తెలుసుకోండి.
హాస్యం జోడించండి: సమస్యలు. తద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే... రోజూ కాసేపు మనసారా నవ్వుకోవడం మీకు తెలిసుండాలి. అందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. అన్నివేళలా సరదాగా మాట్లాడే వ్యక్తుల మధ్య ఉండడం. అలాంటి పుస్తకాలు చదవడం.. టీవీ కార్యక్రమాలు చూడటం.. లాంటివన్నీ ఇందుకు ప్రత్యామ్నాయా లని తెలుసుకోండి.
Comments
Post a Comment